Breaking News

రోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వైద్యాధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ డా జి లక్ష్మీశ వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని చోట్ల ఉదయం 6 గంటలకే ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల నుండి శాంపిల్స్ తీసి రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. త్రాగునీటి శాంపిల్స్ ఎప్పటికప్పుడు పరీక్షించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జనన మరణ నివేదికలు అదేవిధంగా ప్రసవాల నివేదిక ముఖ్యంగా నార్మల్, సిజేరియన్ నమోదు వివరాలు ప్రతిరోజు అందజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని అత్యవసర మందుల నిల్వలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత సమస్య ఉండరాదన్నారు. ప్రతి మంగళవారం ఆరోగ్య సమీక్ష ఉంటుందని అన్నారు. ఏఎన్ఎం నుండి మెడికల్ ఆఫీసర్ వరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత అవసరమని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.మాచర్ల సుహాసిని, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ జె ఇందుమతి. డా.ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డా.జె.సుమన్, డిఐ ఓ డా.శరత్ కుమార్, డిసిహెచ్ఎస్ డా. మాధవి దేవి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *