-ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డా.ధీరజ్ కకాడియ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ‘ప్రెస్ కౌన్సిల్ చట్టం, 1978’ కింద ఏర్పాటు చేయబడిన సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థని,ఇది భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటం మరియు వార్తాపత్రికలు మరియు వార్తా సంస్థల ప్రమాణాలను నిర్వహించడం మరియు మెరుగుపరచడం అనే రెండు లక్ష్యాలతో ఏర్పాటు చేయబడిందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డా.ధీరజ్ కకాడియ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వ్రాసిన డిఓ లేఖలో తెలియజేశారు.అంతేగాక ప్రెస్ కౌన్సిల్ సెక్రటేరియట్ సూచ్నా భవన్, CGO కాంప్లెక్స్,లోధి రోడ్,న్యూఢిల్లీలో ఉందని దీనికి దాని తరపున పని చేయడానికి ఏ రాష్ట్ర శాఖ లేదా అధికృత/ఏ ఇతర సంస్థ లేదని ఆయన స్పష్టం చేశారు.ఇదే పేరును ఇతర ప్రెస్ సంస్థలు ప్రెస్ కౌన్సిల్ అనే పదాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.ఆవిధంగా వినియోగించడం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థాగత విలువను క్షీణింపజేయడమే కాకుండా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ప్రత్యేక డొమైన్ మరియు శీర్షికను కూడా ఉల్లంఘించినట్టు అవుతుందని డా.కకాడియా స్పష్టం చేశారు.
కావున కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మరే ఇతర సంస్థ అయినా ‘ప్రెస్ కౌన్సిల్ ‘ అనే పదాన్ని ఉపయోగించడం,చిహ్నం మరియు పేర్లు(అనుచిత వినియోగం నివారణ)చట్టం, 1950 లోని ఎంట్రీ 7(ii) తో చదవబడిన సెక్షన్ 3 ను ఉల్లంఘించడమేనని న్యాయ వ్యవహారాల శాఖ అభిప్రాయపడిందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డా.కకాడియా పేర్కొన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా “ప్రెస్ కౌన్సిల్” / లేదా దాని హిందీ సమానమైన ” भारतीय प्रेस परिषद ”అనే పేరును ఉపయోగించి ఏదైనా స్థానిక లేదా ప్రభుత్వ సంఘం / సంస్థ యొక్క రిజిస్ట్రేషన్‌ను నిషేధించడానికి లేదా సరిదిద్దడానికి అవసరమైన తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డా.కకాడియ ఆడిఓ లేఖలో విజ్ణప్తి చేశారు.
Prajavartha Online Telugu News