-ఇంకా 2 నెలలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి . . ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తాం
-పుంగనూరు టిడ్కో కాలనీలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపడతాం
-జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
పుంగనూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ ఎస్ కె ల ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో యూరియా పంపిణీలో భాగంగా మంగళవారం పలమనేరు, నియోజకవర్గం పరిధిలోని పెద్దపంజాణి మండలం లో వీరప్పల్లి రైతు సేవ కేంద్రంలో, కొలతూర్, పెద్దపంజాణి మండల ప్రధాన కేంద్రంలో రైతు సేవ కేంద్రాలలో యూరియా రైతులకు ఎలా పంపిణీ చేయుచున్నారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు రైతులతో మాట్లాడారు. అనంతరం పుంగనూరులోని ఆర్ ఎస్ కె లు, సొసైటిలలో యూరియా పంపిణీని కలెక్టర్ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పుంగనూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆర్ ఎస్ కె ల ద్వారా రైతుకు ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 18 వేల మంది రైతులకు 1500 మెట్రిక్ టన్నుల పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గం లో వరి అధికంగా పండిస్తున్న నేపథ్యం లో రైతులకు అదనంగా యూరియా బస్తాలు అవసరం అవుతున్నందున వచ్చే ఆదివారం నుండి మంగళవారం వరకు మరొక బస్తా పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో ఇంకా 2 వేల మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలు మరొక రెండు నెలలకు రైతుల అవసరాలకు సరిపోతాయన్నారు. అవసరం అయితే మరిన్ని బస్తాలు జిల్లాకు తెప్పించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం 45 వేల హెక్టార్లలో పంటలు పండించగా 15 వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేశామని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 21 వేల హెక్టార్లలో పంటలు పండించినందుకు గానూ 13 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, గత సంవత్సరం పంపిణీ చేసిన సరాసరికంటే ఇది అధికామని రైతులు గుర్తించాలన్నారు. ఆర్ ఎస్ కె లలో ఈ-కెవైసీ, బయో మెట్రిక్ తో డి బి టిపద్ధతిలోపారదర్శకంగాయూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. యూరియాతో పాటు నానో యూరియాను కూడా వాడవచ్చునని దీని పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అవసరమైన చోట 20 రోజుల తరువాత మరో విడత పంపిణీ చేస్తామన్నారు. యూరియా పంపిణీ రైతులు పండిస్తున్న పంటను బట్టి ఇస్తున్నామని, అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని, యూరియా వాడడం ద్వారా పండించిన ఆహారంను తీసుకోవడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. రైతులు క్రమంగా యూరియా వాడకం ను తగ్గించాలని కోరారు.
పుంగనూరు టిడ్కో కాలనీలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, టిడ్కో ఈఈ ని ఆదేశించడం జరిగిందని, ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టానున్నామన్నారు. దాదాపు 300 గృహాల కు పైగా ఉండడం తో రేషన్ షాపు ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని, రేషన్ షాపు ఏర్పాటు ను పరిశీలించి చర్యలు చేపట్టాలని డి ఎస్ ఓ ను ఆదేశించడం జరుగుతుందన్నారు.
పి జి ఆర్ ఎస్ కు సంబంధించి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు అనేక ప్రదేశాలలో ప్రత్యేక పి జి ఆర్ ఎస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. వచ్చే నెల పుంగనూరులో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి వెబ్ ల్యాండ్ కరక్షన్, పట్టా సమస్యలు, ఇతర సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News