Breaking News

“కప్పాస్ కిసాన్” యాప్ వివిధ అంశాలపై సమిక్ష సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ చీఫ్ సెక్రటరీ,వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బి.రాజశేఖర్, లలిత్ కుమార్ గుప్తా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ముంబాయి మరియు యం.విజయ సునీత సంచాలకులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారితో కలసి ఎపి సచివాలయంలో మంగళవారం పత్తి కొనుగోలు 2025-2026 కు సంబందించి కొత్తగా సి.సి.ఐ వారు అమలు చేయనున్న “కప్పాస్ కిసాన్” యాప్ మరియు A.P. జిన్నింగ్ మిల్లుల సంఘం వారు లేవనెత్తిన వివిధ అంశాలపై సమిక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశానికి మార్కెటింగ్ మరియు సి.సి.ఐ అధికారులతో పాటు జిన్నింగ్ మిల్లుల సంఘ ప్రతినిధులు పాల్గోన్నారు.

వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుల వారు ఈ కొత్త “కప్పాస్ కిసాన్” యాప్ ద్వారా రైతుల నమోదుతో పాటు తప్పనిసరి స్లాట్ బుకింగ్, మండలాల మ్యాపింగ్ / షెడ్యూలింగ్ మరియు L1/L2/L3 ప్రమాణాల ఆధారంగా జిన్నింగ్ మిల్లులను తెరవడం మొదలగు సి.సి.ఐ. వారి కొత్త మార్గదర్శకాల వల్ల రైతులు వారి పంటను సమీపంలోని కొనుగోలు కేంద్రములో విక్రయించుకోలేని పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నదని తెలియజేసారు. వీటితో పాటు జిన్నర్ల సంఘం వారు ఇతర సమస్యల పై ఇచ్చిన అర్జీ మరియు వారు దేశ వ్యాప్తంగా టెండర్ లను బహిష్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ జిన్నింగ్ మిల్లులలో సి.సి కెమెరాల ఏర్పాటు గురించి  ఉన్నత న్యాయ స్థానం వారు W.P.No.26675/2024 సి.సి. కెమెరా అనలిటిక్స్ ఏర్పాటు చేసుకోవలసినదిగా ఇచ్చిన ఆదేశముల మేరకు సి.సి.ఐ. వారిని టెండర్ల నందు ఈ షరతును నిర్దేశించవలసినదిగా కోరగా, వారు సదరు షరతును టెండర్ల నందు నిర్దేశించారని కానీ ఈ విషయమై జిన్నర్ల సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ సి.సి.ఐ వారుకి వివరించారు.
తదుపరి జిన్నర్లు సంఘ ప్రతినిధులు, రైతుల డూప్లికేషన్ రిజిస్ట్రేషన్, రైతులు తమ భూమి రికార్డులను కిసాన్ మొబైల్ యాప్ నందు వారే నమోదు చేసుకోవడం, తప్పనిసరి స్లాట్ బుకింగ్, మండలాల మ్యాపింగ్ / షెడ్యూలింగ్, L1/L2/L3 ప్రమాణాల ఆధారంగా జిన్నింగ్ మిల్లులను తెరవడం, OT  పరిమితులు మరియు సి.సి.కెమారా అనలిటిక్స్ వంటి వివిధ అంశాల గురించి వారు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ సి.సి కెమారా అనలిటిక్స్ విషయమై వారు ధాఖలు చేసిన కేసు నందు ఉన్నత న్యాయస్ధానము ఇచ్చిన ఆదేశాలను పరిగణములోనికి తీసుకుని ఈ అన్ని విషయముల పట్ల సి.సి.ఐ.వారు తగిన సడలింపులు ఇవ్వాలని కొరియున్నారు.

పై విషయాల పట్ల స్పెషల్ ఛీఫ్ సెక్రటరి రాజశేఖర్ సి.సి.ఐ సి.యం.డి వారితో సమగ్రంగా చర్చించి రాష్ర్ట వ్యవసాయ పరిస్ధితుల దృష్ట్య మరియు రైతుల శ్రేయస్సు దృష్ట్య పత్తి కొనుగోలును వేగవంతం చేయవలసియున్నందున వెంటనే సి.సి.ఐ వారు స్పందించి తగిన సడలింపులు ఇవ్వాలని కోరియున్నారు. దానికి స్పందిస్తూ తేది.11.09.2025 జిన్నర్ల సంఘ ప్రతినిధులతో మరియొక్క సమావేశము నిర్వహించి జిన్నర్ల సమస్యలను పరిష్కరించడానికి మరియు పత్తి కొనుగోలుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సి.సి.ఐ సి.యం.డి వారు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *