-రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
-ఆస్పత్రి అభివృద్ధి, పార్కింగ్, పరిశుభ్రత, డాక్టర్లు, సిబ్బంది అందుబాటు పై ప్రత్యేక దృష్టి
-జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
పుంగనూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రాంతీయ ప్రభుత్వ వైద్య ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుంగనూరులోని ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డాక్టర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని అంచలంచలుగా అభివృద్ధి చేస్తామని, రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రోగులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, పార్కింగ్ వద్ద కూడా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి రోగులకు ఆస్పత్రిలో లభించే సదుపాయాల సమాచారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.రోగులకు అవసరమైన అన్ని మందులు ఆస్పత్రిలో నిల్వలో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రిలోని అంబులెన్స్ కు, డ్రైవర్లకు. ఆయాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. 24×7 డాక్టర్లు విధులు నిర్వహించాలని, రిఫరెన్స్ తగ్గించాలని, మీకు ఎలాంటి సమస్య వచ్చిన నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిన మీ సమస్యను పరిష్కరించడానికి నా వంతు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్ గోపాల్, డాక్టర్ హిమంస్ శైలజ, డాక్టర్ విజయ్ కృష్ణ యాదవ్, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ అనురాధ, డాక్టర్ భార్గవ్ కృష్ణ, ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News