-ఆధునిక టెక్నాలజీ వాహనాల పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అభివృద్ది చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అధ్వర్యంలో కార్పొరేటర్లు బొల్లా విజయకుమార్, బి.ఎస్.వి జానారెడ్డి, సి.హెచ్ రామమోహన రావు, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు లతో కూడిన బృంద సభ్యులు రెండు రోజుల పాటు పూణే నగరంలో పర్యటించనున్నారు. నగరంలో KAM-AVIDA ENVIRO ENGINEERS PVT. LTD వారి ఆహ్వనం మేరకు వీఎంసీ బృందం సోమవారం పూణేలో కంపెనీలోని ఆధునిక టెక్నాలజీ వాహనాల పనితీరును అధ్యయనం చేశారు. యు.జి.డి డ్రెయిన్లు శుభ్రపరచుటకు అత్యాధునిక టెక్నాలజీ తో కలిగిన వాహనముల పని తీరు, ఆపరేట్ చేయు విధానము మొదలగు అంశాలను బృందం సభ్యులు పరిశీంచారు. 7వ తేదీ పూణేలో వీఎంసీ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు.
Prajavartha Online Telugu News