Breaking News

తిరుపతి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటి “మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” ను విజయవంతం చేద్దాం.

– “మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” కు స్టేట్ నోడల్ అధికారులను కేటాయింపు
– మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సుకు సంబంధించి నోడల్ అధికారులు, లైజన్ అధికారులు వారికి కేటాయించిన విధులను పగడ్బందీగా నిర్వర్తించాలి
– విధులు కేటాయించిన అధికారులు సంప్రదాయ దుస్తులతో విధులకు హాజరు కావలి
– జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 14, 15 తేదీలలో జిల్లాలో జరగనున్న *”మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” ను విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

మొట్ట మొదటిసారి తిరుపతి జిల్లాలో *”మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” నిర్వహిస్తున్న నేపధ్యంలో దేశం గర్వించదగ్గ స్థాయిలో కలిసికట్టుగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం బన్సల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తో కలిసి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాలు నందు కాన్ఫెరెన్స్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించి నోడల్ అధికారులకు, లైజన్ అధికారులకు దిశా నిర్దేశం చేసారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14, 15 వ తేదీలలో తిరుపతి రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు *”మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” మన రాష్ట్రం, మన జిల్లా నందు మొట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారని, రాహుల్ కన్వెన్షన్ హాల్ నందు సీటింగ్, స్టేజ్, ఏర్పాట్లు క్రమ పద్దతిగా ఉండేలా లోక్ సభ సెక్రటరీ టీం ద్వారా పగడ్బందీగా నిర్వహించేలా ఆదేశించియున్నారని తెలిపారు. చందిగిరికోట వద్ద అతిథులకు ఆతిథ్యం ఇస్తామని, ఇప్పటికే కొంత మంది అతిథులు వచ్చారని రేపు ఉదయానికి అందరూ రాబోతున్నారని, నోడల్ అధికారులను నియమించడమే కాకుండా ప్రతి రాష్ట్రానికి సూపర్వైసింగ్ నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. అతిథులు వచ్చినప్పటి నుండి తిరిగివెళ్లేంతవరకు విధులు తూచాతప్పకుండా పాటించాలన్నారు. ఈ నెల 14 వ తేదీన రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రానున్నారని, సంబంధిత శాఖ అధికారులు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ సదస్సుకు గౌ. రాష్ట్ర గవర్నర్, లోక్ సభ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రులు,జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు, వివిధ ప్రముఖులు రానున్నారని తెలిపారు. లైజన్ అధికారులు ఎయిర్పోర్ట్ నుండి అతిథులను స్వాగతించి వారు బస ఉండు చోటు వరకు జాగ్రత్తగా చేరుకునేలా అనుసరించాలన్నారు. పోలీసు శాఖ నుండి బందోబస్త్ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. అతిథులకు తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనాలకు ఏర్పాట్లను సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. రాహుల్ కన్వెన్షన్ హాల్ వద్ద వైద్య అధికారులను ఏర్పాటు చేయాలని, హోటళ్ల వద్ద అంబులెన్స్ లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బంది తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించి విధులు నిర్వహించాలన్నారు. తిరుపతి జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, దేవేందర్ రెడ్డి, రోజ్ మాండ్, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, లైజన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *