Breaking News

నేడు మెగా కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని సచివాలయల ద్వారా ఈ నెల 12న ఆదివారం నాడు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు వారికి కోవిడ్ టీకాలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ దృష్ట్యా 18 నుంచి 44 సంవత్సరాల లోపు వయస్సు గలవారు తమ సమీప సచివాలయంలో కోవిడ్ టీకాలు పొందేందుకు ఆదివారం ఏర్పాటు చేసే మెగా కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్ లో కోవిడ్ టీకాలు వేయించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి విడత, రెండవ విడత వాక్సిన్ తీసుకోవలసిన వారు ఈ మెగా కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్ లో కోవిడ్ టీకాలు వేయించుకోవాలన్నారు.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకొనేందుకు వచ్చే వారు కోవిడ్ సూచనలను తప్పక పాటించాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవడం తరచూ చేస్తుండాలన్నారు. కోవిడ్ పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టరు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *