Breaking News

వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలి… : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక విగ్రహాలు నిమజ్జన సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను సూచించారు. శనివారం జగ్గయ్యపేట పట్టణంలోని వారి స్వగృహంలో పోలీసు, రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయివేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నవరాత్రి ఉత్సవాల అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమర్జనాలు చేసుకోవాలని కోరారు. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల, వేదాద్రి గ్రామాలలోని కృష్ణానదిలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ వినాయక విగ్రహాలను నిమర్జనం చేసుకోవాలన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *