Breaking News

పరం టెక్నాలజీస్ ఇంక్ సంస్థ, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి ద్వారా ఉచితం గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు పంపిణి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి సందర్భంగా నగరంలో పరం టెక్నాలజీస్ ఇంక్ సంస్థ, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి ద్వారా ఉచితం గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా అరసవిల్లి అరవింద్ ఛారిటబుల్ ట్రస్ట్, యుఎస్ఎ ఆధారిత సంస్థ పరం టెక్నాలజీస్ ఇంక్, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి వ్యవస్థాపకుడు / చైర్మన్. అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ గతంలో ఏపీ పోలీసుల సంక్షేమ సంఘానికి ఒక లక్ష రూపాయల విరాళం, పలు ప్రాంతాలలో కోవిడ్ 19 ఫస్ట్, సెకండ్ వేవ్ లలో ఎన్నో సేవా కార్యక్రమాలు, థర్డ్ వేవ్ లో కూడా చేతనైనంతలో సాయం చేసే ఈ ప్రక్రియలో భాగంగా ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ టీకా లు వేసే కార్యక్రమం కూడా నిర్వహించామన్నారు. వినాయక చవితి సందర్భంగా సుమారుగా 1000 ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు, అలాగే గరికె పరకలు ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశామన్నారు. ప్రజలందరూ కరోనా కారణంగా మట్టి విగ్రహాలు పూజించి తదనంతరం వారి ఇంటిలోనే పూల కుండీలలో నిమజ్జనం చెయ్యాలని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నగర ప్రజలు అందరు కూడా ఇంటిలో ఘనంగా వినాయకుని పూజించి ఆ స్వామి కృపకి పాత్రులు కావాలని ప్రజలు అందరు సుఖ శాంతులతో ఉండాలని, ఏ విభాలు కలగకుండా ఆ స్వామి వారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *