Breaking News

రాష్ట్ర సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ షేక్ షిరీన్ బేగం ను, సిబ్బందిని అభినందించిన వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం దేవాడ గ్రామంలో ఎన్టీపీసీ సింహాద్రి ఆధీనంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను ప్రభుత్వ కార్యదర్శి అల్ప సంఖ్యాక సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు సర్వే చేయగా య. 319.10 సెంట్లు భూమి ఎన్టీపీసీ వద్ద అన్యాక్రాంతమైన భూమిని గుర్తించటం జరిగిందన్నారు. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్యాక్రాంతమైన మొత్తం 479 ఎకరాల వక్ఫ్ భూములను పరిరక్షించటం జరిగింది. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను పరిరక్షిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ సిబ్బందిని వక్ఫ్ బోర్డ్ సీఈవో షేక్ మహమ్మద్ అలీ, సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ కార్యాలయంలో కమిషనర్ శ్రీమతి షేక్ షిరీన్ బేగం, సిబ్బందిని పుష్ప గుచ్చం, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సంధర్బంగా అసిస్టెంట్ సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ శ్రీ వై. తోయజాక్షరావు, సర్వేయర్లు జి. శివ నాగేశ్వరరావు, రౌతు హనుమంతు, బి. ఆర్. వి. శివ లను వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *