Breaking News

సీపీఐ రాష్ట్ర సారథిగా ఈశ్వరయ్య

-ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ సమితి
-అధికారికంగా ప్రకటించిన రాజా
-రామకృష్ణ స్థానంలో బాధ్యతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ దాసరిభవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ రాష్ట్ర సమితి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాండా, జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, అక్కినేని వనజలు పాల్గొన్నారు.

పి.దుర్గాభవానీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య పేరును జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రతిపాదించగా… కాస్త నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు బలపర్చారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య విద్యార్థి దశ నుంచి ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌లో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, రైతు తదితర ఉద్యమాల్లో తనదైన ముద్రవేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతర పోరాటాలు నిర్వహించారు. ఇంతవరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగాను, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య ఇకపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ఈశ్వరయ్యకు డి.రాజా, రామకృష్ణ పాండా, కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈశ్వరయ్య నేతృత్వాన పార్టీ బలోపేతం కావాలని, బలమైన ప్రజా ఉద్యమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఒంగోలులో ఆగస్టు 23 నుంచి 25 వరకు జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఆ సందర్భంగా సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన కౌన్సిల్‌ 102 మందితో ఏర్పడింది. వారిలో 33 మందిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికవ్వగా, రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక వాయిదా పడింది. జాతీయ మహాసభల అనంతరం రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకుంటామని పార్టీ నాయకత్వం ప్రకటించింది. జాతీయ మహాసభలు ముగియడంతో, తాజాగా ఈశ్వరయ్య ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా డి.రాజా ప్రకటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *