విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటో కార్మికులకే కాకుండా, చిరు వ్యాపారులకుఈ ప్రభుత్వం అండగా నిలుస్తోందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గం లోని 36వ డివిజన్ గాంధీనగర్ లో టి ఎన్ టి యూ సి సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు గరిమెళ్ళ చిన్న ఆధ్వర్యంలో నూతన ఆటో స్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం, ఆటో కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టారని, ఆటో సోదరులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించి, వారికి అండగా ఉంటామని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతోంది అని, గతంలో ఇరవై వేల రూపాయలుగా ఉన్న గ్రీన్ టాక్స్ ను తగ్గించాలని మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయించి దానిని 3 వేల రూపాయలకు తగ్గించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందన్నారు.
ఇది ఆటో కార్మికులకు ఒక పెద్ద ఊరట గా జీవో నంబర్ 21 ను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది అని, దీనిపై న్యాయనిపుణులు పర్యవేక్షిస్తున్నారు, త్వరలో దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు అని, ఆటో కార్మికులపై ఉన్నటువంటి ఫైన్ లు కూడా రద్దు చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి, దానిని కూడా త్వరలో రద్దు చేస్తాం అని, ఆటోల మీద ఉన్నటువంటి ప్రతి ఫైన్ ను కూడా రద్దు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అంతే కాకుండా, ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో రాష్ట్రంలో మూడు లక్షల మంది డ్రైవర్లకు 15వేలురూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది,ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడం వల్ల కొన్ని ఇబ్బందులు మా ఆటో సోదరులకు ఎదురయినందున వాటిని పర్యవేక్షించడానికి, అధిగమించడానికి ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలు ప్రభుత్వం చేపడుతోందన్నారు.
టి ఎన్ టి యూ సి సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు గరిమెళ్ళ చిన్న మీడియా తో మాట్లాడుతూ మా ఆటోఅన్నల కష్టాలు,మా ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని ఆటో డ్రైవర్ల సేవలో పథకం తీసుకువచ్చి మమ్మల్ని అదుకుంటున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మొప్ప వెంకటేశ్వరరావు, ఆటో స్టాండ్ అధ్యక్షులు రోశయ్య, ప్రధాన కార్యదర్శి శ్రావణ్, ఆటో యూనియన్ నాయకులు బాలాజీ, పత్తి అజయ్, మల్లికార్జున్, భాష, పవన్, శివారెడ్డి, గోలి సురేష్, అజీజ్, వెంకట్రావు, రమణ, సుబ్బు, వెంకటరమణ, శ్రీను, స్రవంత్, నాయుడు, కె సుబ్రహ్మణ్యం, నీలం మధు, ముని అప్పలస్వామి, బిజెపి ఆర్ముఖం, డివిజన్ పార్టీ అధ్యక్షులు మద్దినేని సుబ్రహ్మణ్యం, ఇంచార్జ్ ఇమ్మిడి రాము తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News