-జైన్ సమాజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ నేషనల్ స్కూల్ నిర్మాణం
-స్థలం విషయంలో ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్ధులకు అందుబాటులో వుండే విధంగా జైన్ సమాజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటుకు అండగా వుంటానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. రాఘవయ్య పార్క్ వద్ద నమో రెసిడెన్సీలో బుధవారం జైన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైన్ పద్దతిలో ఎంపీ కేశినేని శివనాథ్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాజస్థాన్ లో జైన్ సమాజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటర్ నేషనల్ స్కూల్ భవనాన్ని వీడియో రూపంలో ఎంపీ కేశినేని శివనాథ్ కు చూపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధులకు అందుబాటులో వుండే విధంగా విజయవాడ లో కూడా ఆ తరహా స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపి సహాయ సహకారాలు అందించాల్సిందిగా జైన్ సమాజ్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ ను కోరారు.
అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సేవా గుణం కలిగిన జైనుల అవసరం సమాజానికి ఎంతో వుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇప్పించే విధంగా కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో జైన్ సమాజ్ ఆర్గనైజేషన్ సభ్యులు ప్రవీణ్ కుమార్ జైన్, దిలీప్ కుమార్ జైన్, దినేష్, సొసైటీ ఫర్ వైబ్రేట్ విజయవాడ ప్రెసిడెంట్ ముత సొసైటీ ఫర్ వైబ్రేట్ విజయవాడ ప్రెసిడెంట్ ముత్తవరపు మురళీకృష్ణ, టిడిపి నాయకుడు పీతా బుజ్జి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News