Breaking News

కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బందిని పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగిందని తూర్పు పా౦త విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పు గోదావరి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయబడినట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులు మరియు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ తూర్పు గోదావరి మరియు తూర్పు పా౦త విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, విశాఖపట్నం ఆదేశాల మేరకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌లు 24 గంటలపాటు మూడు షిఫ్టులలో పనిచేసే విధంగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

సంప్రదించవలసిన నంబర్లు:
జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం, రాజమహేంద్రవరం – 73822 99960 / 0883-2463354
రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ – 94906 10093
రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ – 94931 78874
నిడదవోలు డివిజన్ – 83329 73595

భారీ వర్షాలు లేదా వరదల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన పక్షంలో, సమీపంలోని విద్యుత్ సెక్షన్ కార్యాలయానికి గాని, టోల్‌ఫ్రీ నంబర్ 1912కు గాని లేదా పై నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *