Breaking News

పంటలను రక్షించే దిశగా క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించండి…

-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ వ్యవసాయ ప్రత్యేక కార్యదర్శి.
– ముఖ్యమంత్రి  ఈరోజు  రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆర్ టి జి ఎస్ లో జరిపిన తుఫాను సంసిద్ధతపై ,తుఫాను రాకముందే నష్టం ను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలపై తెలిపిన ప్రత్యేక ఆదేశాలను అనుసరించి 

అమరావతి., నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఐఏఎస్ సోమవారం టెలికాన్ఫరెన్స్ లో వ్యవసాయ ,ఉద్యాన ,పశుసంవర్ధక ,మత్స్య మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధిపతులతో , సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షిస్తూ ముఖ్యమంత్రి  ప్రత్యేక సూచనలను ,ఆదేశాలను తెలియచేశారు .
* వారు మాట్లాడుతూ తుఫాను గాలివేగం ,పడబోయే వర్షపాతం ,తుఫాను పయనించే గమనములోని పంటల పరిస్థితి,వాటి దశ ను సమన్వయం చేస్తూ వాసర్ లాబ్స్ అభివృద్ధి చేసిన ఎపి ఎయిమ్స్ ద్వారా వ్యవసాయ పంటల సాగు లో ఉన్న ప్రభావిత, సున్నిత గ్రామాలను గుర్తించడం జరిగిందని తెలిపారు .సంబంధిత సమాచారం క్షేత స్థాయిలోని చిట్టచివరి రైతు సేవకేంద్రం క్షేత్ర సహాయకుల వరకు అందించి ,రైతులకు తుఫాను రాకముందు పంట రక్షించే అంశాలను ,చేయవలసిన సాంకేతిక సలహాలను ప్రత్యక్షముగా వారిని కలిసి కార్యోన్ముఖులను చేయాలని,తద్వారా నష్టం ను తగ్గించాలని ఆదేశించారు.ప్రతి మూడు గంటల వ్యవధిలో తుఫాను పరిస్థితిపై ఇచ్చే బులెటిన్ లను రైతులకు తెలియచేస్తూ పూర్తి అందుబాటులో ఉండాలని ఆదేశించారు .
* ఈ సమయములో క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారుల పనితీరును సమీక్షించడానికి ఆర్ టి జి ఎస్ వారు ఐ వి ఆర్ ఎస్ ద్వారా గ్రామ రైతులనుండి విషయ సేకరణ జరుపుతారని ఎటువంటి ఫిర్యాదులు అందితే నిర్లక్ష్యం గా వున్న వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
* వ్యవసాయ సంచాలకులు డా. మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ క్షేత్ర సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతున్నదని,గోదావరి జిల్లాలలో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాలువల ద్వారా నీటి విడుదలను ఆపటం, తగ్గించడం జరిగిందని ,ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి మడులలోని గ ట్లను తొలగించిస్తున్నారని ,నీరు నిలవకుండా పొలాలను పర్యటిస్తూ చైతన్యం చేస్తున్నారని తెలిపారు .మురుగు – డ్రైనేజ్ నీరు పోయే విధముగా అధికారులతో కలిసి ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు .
* వారు తుఫాను ముందు ఏర్పాట్లను తెలియచేస్తూ ఇప్పటివరకు రైతులకు 69 లక్షల మెసేజ్ అలెర్ట్ సందేశాలను పంటల వారీగా ఇవ్వడం జరిగింది
* వివిధ ప్రింట్ ,సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంటను రక్షించే సమాచారాన్ని అందిస్తున్నామని
* 6.23 లక్షల ఎకరాల వరి పంట ను సున్నితమైన గ్రామములోని పంటలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు .
* 24 గంటలు అందుబాటులో ఉండే విధముగా రాష్ట్ర కంట్రోల్ రూమ్ లో వ్యవసాయ సిబ్బందిని నియమించామని తెలిపారు .
* ఉద్యాన సంచాలకులు శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్రములోని అరటి ,కూరగాయ పంటలు తుఫాను తీవ్రత కు గురవుతాయని ,అరటి చెట్లు పడిపోకుండా స్టాకింగ్ -కట్టెలతో చెట్లను నిలబడేట్లు చేయాలని తెలిపారు.కోనసీమ ,కాకినాడ జిల్లాలలో అరటి సాగు ఎక్కువుగా ఉన్నదని తెలిపారు .
* మత్స్య శాఖ సంచాలకులు నాయక్ మాట్లాడుతూ నాలుగు బోట్లు , జాలర్లు ఒరిస్సా నుండి రావాల్సిఉందని ,మిగిలిన జాలర్లు , పడవులు వేటకు వెళ్లకుండా వారి అధీనంలోనే ఉన్నారని తెలిపారు.
* వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు విజయ సునీత మాట్లాడుతూ వరి తర్వాత పత్తి లో తుఫాను తాకిడి ఎక్కువగా ఉంటుందని , యన్ టి ఆర్ జిల్లాలో ఎక్కువగా కాయలు నల్లబడటం ,తడవటం జరిగిందని తెలిపారు .కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోలుకు తేమ శాతం అతి ముఖ్యమని ,తుఫానుకుముందుగానే తయారైన పత్తిని తీసుకోవాలని తెలియచేశారు .
* పశుసంవర్ధక సంచాలకులు మాట్లాడుతూ లంకలలో ఉన్న గొర్రెలను ,పశువులను సురక్షిత ప్రాంతాలకు చేర్చామని , పశువుల మందులు , దాణా సిద్ధం చేశామని తెలిపారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *