Breaking News

తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

• సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే విధుల్లో చేరాలి.
• చెరువులు, కాల్వ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేయాలి.
• బుడమేరు డైవర్షన్ ఛానెల్ పై నిరంతర నిఘా ఉండాలి.
– జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో ఇరిగేషన్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, సిఈ స్ధాయి నుండి కింది స్దాయిలోని లష్కర్ వరకు క్షేత్ర స్దాయిలో పర్యటించాలని ఆదేశించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కడా స్పెషల్ కమీషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సి నరసింహ మూర్తి, మరియు సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ తమకు కేటాయించిన హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, అధికారులు తమ సెలవులు రద్దుచేసుకుని, తప్పని సరిగా విధులకు హాజరుకావాలని ఆదేశించారు.

చెరువులు, కాల్వ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేయాలి అని, ఇందుకోసం ఇసుక బస్తాలు, మోటార్లు, బోట్లువంటి అత్యవసర సామాగ్రి సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు, గేట్లు, స్యూయిజ్ లు, సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో, ఎప్పిటికప్పుడు తనిఖీ చేయాలని, అధికారులకు సూచించారు. తుఫాన్ కారణంగా వాగులు, రిజర్వాయర్ల నుండి దిగువకు నీరు విడుదల చేసేముందు, సమీప ప్రవాహ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయాలి అని అన్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, పంటలకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా లో వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని, బుడమేరు డైవర్షన్ ఛానెల్ పై నిరంతర నిఘా ఉండాలని, వెలగలేరు రెగ్యులేటర్ నుండి ఎనికేపాడు యూటీ వరకు విజయవాడ నగర పరిధిలో ఓల్డ్ బుడమేరు అంతా, ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా, తొలగించాలి అని తెలిపారు. ఎర్ర కాలువ, యనమదురు డ్రైన్, బురద కాలువ, సుద్ద వాగు, ఏలేరు రిజర్వాయర్, రైవాడ కాలువ వంటి వాటిపై నిరంతర నిఘా పెట్టాలి అని, జిల్లా కలెక్టర్, రెవిన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, విద్యుత్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్, శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *