గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాన్ నేపధ్యంలో అన్నక్యాంటీన్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చుట్టగుంట దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పెద్ద చెట్లు లేదా పాత గోడలు ఉంటే వర్షాలు, గాలుల వలన కూలిపోయే ప్రమాదం ఉన్నందున తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున ఈగలు, ఇతర క్రిమి కీటాకాలు రాకుండా డిస్ ఇన్ఫెక్షన్ చర్యలను చేపట్టాలన్నారు. అలాగే ఆహార సరఫరా అనంతరం ప్రాంగణం శుభ్రం చేయాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు.
Prajavartha Online Telugu News