Breaking News

మొంథా తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గద్దె క్రాంతి కుమార్

-5, 6 డివిజన్ల కొండ ప్రాంతాల్లో పర్యటించిన గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్న నేపథ్యంలో 6వ డివిజన్ బి.ఆర్. నగర్ ఒకటవ లైన్ నుండి 6వ లైన్ వరకు మరియు 5వ డివిజన్ అమ్మ కళ్యాణమండపం ఎదురు గల కొండ అంచు ప్రాంతాల్లో టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ మంగళవారం పర్యటించారు. కొండ అంచుల్లో నివసిస్తున్న ప్రజలను ఇంటింటికి వెళ్లి గద్దె క్రాంతి కుమార్ అప్రమత్తం చేస్తూ, ఎప్పుడైనా కొండరాళ్లు జారిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇళ్లను తాత్కాలికంగా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్రజలు వర్షాలు, గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, కొండరాళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు పడే ప్రమాదం ఉన్నందున బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని గద్దె క్రాంతి కుమార్ సూచించారు. ఈ సందర్భంగా 5వ డివిజన్ అమ్మ కళ్యాణమండపం ఎదురు కొండ అంచు ప్రాంత ప్రజలు తమకు కేటాయించిన పునరావాస కేంద్రం దూరంగా ఉందని, దగ్గరలో ఏర్పాటు చేయాలని కోరగా, గద్దె క్రాంతి కుమార్ వెంటనే అధికారులతో మాట్లాడి వారికి సమీపంలోని వేరొక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు.

గద్దె క్రాంతి కుమార్ తో పాటు పడాల గంగాధర్, మొకర గురునాధం, బచ్చలగురి అజయ్, షేక్.షరీఫ్, వడ్డీ సుబ్బారావు, పి.నాగు, ఆర్. బ్రహ్మేశ్వరరావు, కట్టేవరపు కిషోర్, పి.రంగా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *