అమలాపురం నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిసర తీర ప్రాంతాలలో నేటి (మంగళవారం) రాత్రికి తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు జిల్లా మొంథా తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి విజ య రామరాజు వెల్లడించారు. మంగళ వారం స్థానిక కలెక్టరేట్ నుండి వారు గ్రామ సచి వాలయ స్థాయి వరకు వీడియో కాన్ఫరె న్స్ నిర్వ హించి మొంథా తుఫా న్ ను సమర్థవంతంగా ఎదుర్కొ నేందుకు సన్నద్ధత సహాయక చర్యల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడు తూ సముద్ర తీర ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధి లో ఉన్న కచ్చా గృహాలు పక్కా గృహాలలో నివసిస్తున్న వారిని మధ్యాహ్నం రెండు గంటల లోపుగా పోలీస్ సిబ్బంది సహకా రంతో బై ఫోర్సు ను వినియోగించి తప్పనిసరిగా మ్యాపింగ్ చేసిన పునరావాస కేంద్రా లకు తరలిస్తూ ప్రాణ ఆస్తి నష్టాలను పూర్తిగా నివారిం చాలన్నారు ప్రతి పునరా వస కేంద్రానికి కేటాయించిన ఇన్చార్జి అధికారి నాణ్య మైన ఆహారం, అన్ని రకాల ఔషధాలతో మెడి కల్ క్యాంపులు సురక్షితమైన త్రాగునీరు వంటి కనీస వస తులు కల్పన ద్వారా తా త్కాలికంగా ఆశ్రయం పొందేలా చర్యలు చేపట్టా లన్నారు. మొంథా తుఫాన్ ముప్పు కోనసీమ జిల్లాకు ఉన్నందున తీరప్రాంత ప్రజలను తక్షణం పునరా వాస కేంద్రాలకు పోలీసుల సహకారంతో తప్పనిసరిగా తరలించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో క్షేత్రస్థాయి అధికా రులు తీర ప్రాంత వాసు లను అప్రమత్తం చేస్తూ సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తర లిస్తూ నాణ్యమైన ఆహారాన్ని ఆరోగ్య భద్రత ను కల్పిం చాల న్నారు తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా ఆహారం తాగునీరు కలుషితం కాకుండా హైజిన్ వంటి అన్ని జాగ్రత్తలు పాటిం చాలన్నారు. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగిందని ఎక్కడా ఎటు వంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించ కుండా అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించా రు. జిల్లా యంత్రాం గమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్ను సమర్ధవం తంగా ఎదుర్కోవాలన్నారు. తుఫాను తీరాన్ని దాటే ప్రాంతంలో సుమారుగా గంట సమయం పాటు తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. తుఫాన్ అనంతరం ముం దుగా రోడ్డు కనెక్టివిటీ కొరకు చెట్లు స్తంభాలు తొలగిం చాలని పవర్ కనెక్టివిటీ నీ విద్యుత్ స్తంభాలను ట్రాన్స్ఫా ర్మర్ల కండక్టర్లు ఏర్పాటు ద్వారా పునరు ద్ధరణ కై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లా డుతూ తీర ప్రాంతంలో జి ప్లస్ వన్ గృహాలలో ఉన్న వారి తప్ప మిగిలిన సముద్ర తీరానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న కచ్చా పక్కా గృహాలలోని వారు తప్పని సరిగా పునరావాస కేంద్రా లలో ఆశ్రయం పొందాలన్నారు. కాట్రేనికోన ఐ పోలవరం సఖినేటిపల్లి మల్కిపురం, ఉప్పలగుప్తం కొత్తపేట మండలాలు సు మారుగా 7 వేల మందినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు ఈ తరలింపు ప్రక్రియను అధికారులు మ ధ్యాహ్నం 2 గంటల్లోపు పూర్తి చేయాలన్నారు శిథిలావస్థకు చేరిన వసతి గృహాలలో విద్యార్థినీ విద్యా ర్థులు నివాసం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ముంపు బాధితుల తరలింపులో ఎటువంటి అలసత్వాన్ని వహించరాదని ఆయన పునరుద్ఘాటించారు. మొంథా తుఫాన్ రిస్క్యూ ఆపరేషన్స్ పునరావాసం వంట అంశాలలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు జిల్లా యం త్రాంగం నిర్దిష్ట ఆదేశాలను అందరూ తూ చా తప్ప కుండా ఆచరించి మొంథా తుఫాన్ ముప్పును సమర్థ వంతంగా ఎదుర్కొనాలని ఆదేశించారు. తుఫాన్ తీరాన్ని దాటే సమ యంలో పూర్తిగా విద్యుత్ సరఫరా ను నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు. తుఫాన్ తీరాన్ని దాటిన సమయంలో తీర ప్రాంత వాసులు ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్ళ రాదని సురక్షితంగా ఇంటిలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయాన్ని క్షేత్రస్థాయి అధికా రులకు తెలియజే యడం జరుగుతుంద న్నారు. ఆ సమ యంలో అందరూసంయమనం పాటించి రాబోయే 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండా లన్నారు. తుఫాను దృష్ట్యా మార్కెట్లో నిత్యవసర వస్తువులు ధరలు అదుపులో ఉంచా లని ఎడి మార్కెట్ ని ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు తుఫాన్ ప్రమాదం ముగిసే వరకు మండల, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహా యక చర్యలను పర్యవేక్షిం చాలని ఆదేశించారు. సహా యక కేంద్రాలలో భోజన, వసతి సదుపా యాలు సక్రమంగా ఉండాలన్నారు ప్రభావిత ప్రాంతాల్లో నిత్య వసర వస్తువులు విల్వలు తగినన్ని అందుబాటులో ఉందుకోవాల న్నారు. సమాచార వ్యవస్థ సేవలలో ఎటువంటి అం తరాయం లేకుండా చూడా లన్నారు. వివిధ శాఖల సమస్వయం తో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తీర ప్రాంత ప్రజల తరలింపు ఆపరేషన్, పునరా వాసం, ఆస్తి ప్రాణ నష్టాలు, రహదారులు పునరుద్ధరణ విద్యుత్ పున రుద్ధరణ వం టి చర్యల ద్వారా మొంథా తుఫాన్ ముప్పును ఎదుర్కొనాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ తీర ప్రాంతంలో మెరైన్ పోలీ సులతోపాటుగా సుమారు 150 గ్రామ సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులతో తీర ప్రాంత గస్తీ ని నిర్వహించి సముద్ర తీరంలో ఎవరు సంచరించకుండా చర్యలు చేపడతారన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ కే మాధవి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొ న్నారు
Prajavartha Online Telugu News