Breaking News

అనుమతి పొందిన లేఔట్‌లలో మాత్రమే ప్లాట్స్ కొనుగోలు చేయాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ(APCRDA) పరిధిలో గల కొన్ని గ్రామాలలో ప్రభుత్వము నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటైన అక్రమ లేఔట్‌లను మరియు అనధికార భవనాలను APCRDA అధికారులు తేదీ 10.11.2025 & 11.11.2025వ తేదీలలో ప్రొక్లైనర్‌తో తొలగించారు. అట్టి విధంగా తొలగించిన వివరాలు PDFలో జత చేయబడినవి. సదరు అనధికార లేఔట్‌లలోని ప్లాట్స్ కొనిన యెడల భవన నిర్మాణములకు అనుమతులు మంజూరు చేయబడవు అలాగే మౌలిక సదుపాయములు కొరకు ఇబ్బందులు కలుగును. కావున ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని ప్రజలు ప్రభుత్వ అనుమతి పొందిన లేఔట్‌లలో మాత్రమే ప్లాట్స్ కొనుగోలు చేసుకొనవలసినదిగా తెలియచేయడమైనది. ఈ విధమైన ప్లాను లేని భవనములు కట్టుకున్న యెడల లేదా కొనుగోలు చేసిన యెడల విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజి కనెక్షన్‌లకు అనుమతులు మంజూరు చేయబడవని తెలియజేయుచున్నాము. CRDA పరిధిలోని ప్రజలు భవనాలను నిర్మించుకునే సమయములో తప్పనిసరిగా ముందస్తు ప్లాను అనుమతి తీసుకుని మాత్రమే భవన నిర్మాణములు ప్రారంభించవలసినదిగా తెలియచేయడమైనది. ఏవైనా అనధికార లేఔట్‌లు లేదా అనధికార కట్టడములు గుర్తించిన యెడల ఈ క్రింది తెలిపిన నెంబర్‌లో, వాట్సప్ నెంబర్‌కు, అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమాచారము తెలియపరచగలరు.
వాట్సప్ నెంబర్ :7095599838(మెసేజ్ కొరకు)
సంప్రదించవలసిన నెంబర్ :0866-2527154
వెబ్సైట్ : https://crda.ap.gov.in/apcrdav2/Views/Grievance Redressal System.aspx

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *