విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ అక్యుపంక్చర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ హోం కేంద్ర కార్యాలయం లో అక్యుపంక్చర్ రంగంలో దేశవ్యాప్తంగా విశిష్ట కృషి చేసిన 42 మందికి సేవ రత్న, వైద్యరత్న అవార్డుస్ తో సత్కరించినట్లు ఎస్పా భారత్ వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. నవంబర్ ఒకటో తారీకు నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అ క్యుపంక్చర్ అవగాహన చికిత్స శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రచార జాత నిర్వహించి నారు.ఈరోజు జరిగిన ఉత్సవ సభలో ముఖ్యఅతిథిగా ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ రాజారావు పాల్గొని పాల్గొని బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ మందులు వాడకుండా, సర్జరీలు తగ్గించి మూల సమస్యను తగ్గించే అక్యుపంక్చర్ చాలా మంచి విధానమని,అందరూ తెలుసుకుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. ఎస్పా భారత్ జాతీయ అధ్యక్షుడు అలవాల రవి మాట్లాడుతూ దేశంలో అక్యుపంక్చర్ అభివృద్ధికి ప్రభుత్వ హాస్పటల్లో ఉద్యోగులను నియమించాలని కోరారు. ఈ సభలో అనేక రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ, సిఐడి పోలీస్ డిపార్ట్మెంట్, ఏఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గుడివాడ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, గుంటూరు హిందూ కాలేజీ అఫ్ ఫార్మసీ, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్,చల్లపల్లి విజయ్ క్రాంతి డిగ్రీ కాలేజ్, రేపల్లె జేఎల్బి కాలేజ్,పిఠాపురం డాక్టర్ కుమార్ అలీషా ట్రస్ట్, రాజమండ్రి బిజెపి కార్యాలయం మొదలగు వారు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పా ఉపాధ్యక్షులు ముంజంపల్లి శివకుమార్, భూతపాటి ఉదయ్ కుమార్, షేక్ ఆశ్రపున్నిశ, రాధా, కొండవీటి సుమతి మొదలగు అతి ముఖ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News