Breaking News

సఫాయి కర్మచారి వృత్తి దారులకు సబ్సిడీ పై మురుగు శుద్ధి వాహనాలు

-ప్రతి వాహనం పై 14 లక్షల రూపాయల సబ్సిడీ
-మిగిలిన రూ.17.5 లక్షలు ఋణం గా పొందే అవకాశం
-ఉమ్మడి కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు షేక్ షాహిద్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
NSKEDC పథకం ద్వారా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల మంజూరుకు ఉమ్మడి కృష్ణా(కృష్ణా & ఎన్టీఆర్) జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్, మచిలీపట్నం కార్యనిర్వాహక సంచాలకులు షేక్ షాహిద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి వాహన వ్యయం 31,67,326/- రూపాయలు అని, ఇందులో 14,16,831.50 రూపాయల సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. మిగిలిన 17,50,494.50 రూపాయల మొత్తాన్ని NSKFDC ఋణం గా పొందవచ్చని తెలిపారు.

NSKFDC పథకం కింద 29-11-2023న ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులముల ఆర్థిక సహకార సంఘం వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి కృష్ణా జిల్లాకు మంజూరు చేసిన 3000 లీటర్ల సామర్థ్యం గల సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు తిరిగి కేటాయింపు కోసం అందుబాటులో ఉన్నాయని చెప్పారు.గతంలో లబ్ధిదారులుగా ఎంపికై, ఋణాన్ని చెల్లించడంలో విఫలమైన వారి వాహనాలను పథకం షరతుల మేరకు కొత్త అర్హులైన అభ్యర్థులకు మళ్లీ మంజూరు చేస్తామన్నారు.

ఆసక్తి, అనుభవం, క్రింది అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు 30-11-2025 లోపు, నేరుగా కృష్ణా జిల్లా ఎస్. సి .కార్పొరేషన్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

అర్హతలు

1. 5 మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడవలెను.
2. గ్రూపులోని ప్రతి సభ్యుడు సఫాయి కర్మచారి వృత్తి దారు అయి ఉండాలి.
3. గ్రూపులో కనీసం ఒకరికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
4. వాహనం విలువలో సబ్సిడీని మినహాయించి మిగిలిన ఋణాన్ని 72 నెలసరి వాయిదాలలో ఈ కార్యాలయానికి క్రమం తప్పకుండా చెల్లించవలెను. ఒక్కో వాయిదా రూ. 33,064/- గా నిర్ణయించబడింది.

ఇతర వివరాలకు 9652057244 నంబర్ ను సంప్రదించాలని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *