విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఎన్టిఆర్ జిల్లాలో మొత్తం 3,59,733 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో సుమారు 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం, జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 150 రైతు సేవా కేంద్రాల (RSKs) ద్వారా నేరుగా రైతుల నుండి మద్దతు ధర (MSP) వద్ద కొనుగోలు చేయనుంది. మరియు అధనముగా 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయటకు కూడా పౌర సరఫరాల ప్రధాన కార్యాలయము వారు సిద్ధముగా ఉన్నారు. జిల్లాలో100 శాతం ఈ-క్రాప్ నమోదు పూర్తి చేశారు. రైతు సేవా కేంద్రాలు అక్టోబర్ 17వ తేదీ నుండి ప్యాడీ కొనుగోలు కార్యకలాపాలు ప్రారంభించాయి.
ధాన్యం సంచుల సరఫరా చర్యల్లో భాగంగా, తిరువూరు డివిజన్లో 6,48,600 సంచులు, విజయవాడ డివిజన్లో 2,79,200 సంచులు, నందిగామ డివిజన్లో 1,40,000 సంచులు, మొత్తంగా 10,67,800 గోనె సంచులు రైతులకు అందుబాటులో ఉంచడం అయినది. రైతులు తమ ధాన్యాన్ని సమీప రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించి, మద్దతు ధర (MSP) సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. అలాగే, ధాన్యం తేమ ప్రమాణాలు (FAQ norms) పాటించేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1179 జిపిఎస్ కలిగిన వాహనములు కూడా ధాన్యము రవాణాకు అందుబాటులో ఉన్నవి.
ఇప్పటి వరకు జిల్లా స్థాయి నందు 13,000 మెట్రిక్ టన్నుల ధాన్యమును, 72 ధాన్యము కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగినది. అందులో తిరువూరు డివిజన్ నందు 42 ఆర్. ఎస్. కే లా ద్వారా . నందిగామ నందు 16 ఆర్. ఎస్. కే లా ద్వారా మరియు విజయవాడ నందు 16 ఆర్. ఎస్. కే లా ద్వారా కొనుగోలు చేయడం అయినది. ప్రతికూల పరిస్థితి నందు కూడా రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా దైర్యముగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి కనీస మద్దతు ధర అందే విధముగా వారి యొక్క ధాన్యమును విక్రయించుకోగలరు. మరియు 1700 తార్పాలీన్ లను కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం అయినది.
Prajavartha Online Telugu News