Breaking News

కార్యకర్తల గుండె ధైర్యం జనసేన

-కుటుంబాల గురించి ఆలోచించే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్
-ప్రమాద బీమా చెక్కుల పంపిణీలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఎమ్మెల్సీ కె. నాగబాబు
-ఇప్పటి వరకూ 1400 మందికిపైగా క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు
రూ. 46.73 కోట్లు బీమా అందజేసినట్లు వెల్లడి
-ఆదివారం సాయంత్రం తాడేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 220 మంది క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులు పంపిణీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోట్లాదిమంది ఆత్మీయంగా అభిమానించే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈ రోజు ప్రతీ కార్యకర్తకు గుండె ధైర్యంగా నిలబడిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిలో జరిగిన ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో- వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 220 మంది క్రియాశీలక కార్యకర్తలకు సంబంధించి వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 11 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నాగబాబు  మాట్లాడుతూ భుజాలపై జెండా మోసే ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా ద్వారా ఇప్పటి వరకూ 1400 మందికి పైగా కార్యకర్తల కుటుంబాలకు రూ. 46.73 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయి దుఃఖంలో ఉన్నవారికి ప్రమాద బీమా ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం ఆ కుటుంబానికి మేమున్నామని ఇస్తున్న భరోసాలాంటిదన్నారు. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన 893 మంది జనసైనికులు, వీర మహిళల కుటుంబాలకు అందించిన బీమా రూ. 44.65, కోట్లు కాగా, ప్రమాదాల ద్వారా గాయాల పాలైన 533 మందికి రూ. 2.08 కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ. 46,73 కోట్లు బీమా ద్వారా అందజేసినట్లు తెలిపారు.
• ఒకేసారి 220 కుటుంబాలకు చెక్కుల పంపిణీ
ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా ఒకేసారి 220 కుటుంబాలకు రూ.11 కోట్ల విలువైన ప్రమాద బీమా చెక్కులను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందించింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాల కన్నీరు తుడిచింది. జన సైనికులే జనసేన పార్టీ బలం… వారే నా కుటుంబ సభ్యులు అని చెప్పిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు… అందుకు తగ్గట్టే కష్టకాలంలో వారిని అక్కున చేర్చుకున్నారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన 220 క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. క్షేత్రస్థాయిలో జనసేన జెండా పట్టుకొని నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని మరోసారి చాటి చెప్పింది.
ఈ కార్యక్రమానికి జనసేన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, రామ్ తాళ్ళూరి, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, రాష్ట్ర వడ్డీలు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ షేక్ రియాజ్, పీసీబీ సభ్యుడు పంచకర్ల సందీప్, పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు తాతంశెట్టి నాగేంద్ర, వై.శ్రీనివాస్, పిసిని చంద్రమోహన్, గాదె వెంకటేశ్వరరావు, ఆల అనిల్ కుమార్, టి.రమాదేవి, గంజి చిరంజీవి, అక్కల గాంధీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *