-స్లాట్ ట్రాన్స్ఫర్ కు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి
-దివ్యాంగులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సదరం స్లాట్ బుకింగుల విషయంలో దళారిలను నమ్మవద్దని ప్రభుత్వం దివ్యాoగులకు విజ్ఞప్తి చేసింది.
సదరం (SADAREM -Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) ద్వారా దివ్యాంగులకు వైకల్య దృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 14, 2025న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,050 స్లాట్లు విడుదల చేశారు. మొత్తం స్లాట్లు రెండు రోజుల్లో బుక్ అయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం 118 ఆస్పత్రుల్లో (గతంలో 112 + ఈసారి అదనంగా 6) వైకల్య నిర్ధారణ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కొందరు దళారులు “ఇతర జిల్లాల్లో స్లాట్ బుక్ చేసి, తర్వాత అనంతపురం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తాం” అని రూ.5,000 నుంచి రూ.10,000 వరకు డిమాండ్ చేస్తూ దివ్యాంగులను మోసం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
దళారులపై కఠిన చర్యలు
” స్లాట్ బుకింగ్, ట్రాన్స్ఫర్ కోసం దళారుల్ని ఎట్టి పరిస్థుల్లోనూ నమ్మొద్దు. దళారులు/మధ్యవర్తుల ద్వారా బుక్ చేసినా, డబ్బులిచ్చినా మీ స్లాట్ ట్రాన్స్ ఫర్ జరగదు. అలాంటి వాటిని తక్షణమే రద్దు చేస్తాం. దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ కేసులు పెడతాం ” అని అధికారులు స్పష్టం చేశారు.
స్లాట్ ట్రాన్సఫర్ ఇలా…
“PGRS పోర్టల్ లో (https:// pgrs. ap. gov. in) రిక్వెష్ట్ పెట్టుకోవాలి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే “గ్రీవెన్స్ డే” లోనూ,
డిసిహెచ్యస్(DCHS) కార్యాలయంలోనూ రాతపూర్వక అభ్యర్ధన ఇవ్వాలి. ప్రస్తుతం స్లాట్ బుక్ అయిన ఆస్పత్రి నుంచి అధికారిక మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. వీటిలో ఏదో ఒక విధంగా అభ్యర్ధన పెట్టుకుంటే 100 శాతం మీరు కోరిన ఆస్పత్రికి స్లాట్ ట్రాన్స్ఫర్ ఉచితంగా జరుగుతుంది” అని అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News