Breaking News

డ్రైనేజీ పై ఉన్న ఆక్రమణలు తొలగింపు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు వర్షపునీరు రోడ్డుపైన నిలవ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ లో ఎటువంటి లోపాలు లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, స్క్యూ బ్రిడ్జ్ వద్ద సర్వీస్ రోడ్లో గల డ్రైనేజ్ పై ఉన్న ఆక్రమణలను, కృష్ణలంకలో ఉన్న అనధికార కట్టడాలను పట్టణ ప్రణాళిక సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగర పరిధి లో గల డ్రైనేజ్ పైనున్న ఆక్రమణలు, అనధికార కట్టడాలు తొలగిస్తున్నామని, ప్రత్యేకంగా వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా డ్రైనేజ్ వ్యవస్థలో ఎటువంటి లోపాలు లేకుండా తీసుకుంటున్న చర్యలు లో భాగంగా డ్రైనేజ్ పై ఆక్రమణలను తొలగిస్తున్నామని అన్నారు. కావున ప్రజలు దీన్ని గమనించాలని, అనుమతి లేనిదే భవనాలు నిర్మించరాదని, ఆగస్టు 31, 2025 కల్లా ఏమైనా అనధికార భవనాలు నిర్మించినచో వెంటనే బిల్డింగ్ పినలైజేషన్ స్కీం ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *