Breaking News

నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ అర్జీల స్వీక‌ర‌ణ‌

– ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా సుప‌రిపాల‌న ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ చొర‌వ‌
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా సుప‌రిపాల‌న ల‌క్ష్యంగా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ఫిర్యాదు వేదిక (పీజీఆర్ఎస్‌), ప్ర‌జా ద‌ర్బార్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని.. గౌర‌వ ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో స‌మ‌స్య‌లను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించేందుకు కృషిచేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, శాస‌న‌స‌భ్యులు యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు తెలిపారు.
శుక్ర‌వారం విజ‌య‌వాడ రూర‌ల్‌, నున్న‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌గా.. గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యులు యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మొత్తం 414 అర్జీలు వ‌చ్చాయి. వీటిని నిర్దేశ గ‌డువులోగా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆయా శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల‌నే లక్ష్యంతో నియోజకవర్గాల స్థాయిలోనూ పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌తో పాటు షెడ్యూల్ ప్ర‌కారం నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. అందులో భాగంగా నున్న గ్రామంలో అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అర్జీలు సమర్పించిన వారికి సంతృప్తికర పరిష్కారం చూపాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో గ్రామ‌వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి , విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, జెడ్‌పీ సీఈవో కె.క‌న్న‌మ‌నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *