-కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలి, కాపునాడు స్వర్ణోత్సవ సభలో ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగించిన ఎమ్మెల్యే బోండా ఉమ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్లో ఆదివారం కాపునాడు స్వర్ణోత్సవాల వేడుకల సభ జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం నాయకత్వంలో జరగకగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు స్వర్గీయ అమరజీవి స్ఫూర్తి ప్రదాత కాపు జాతి ఆరాధ్య దైవం వంగవీటి మోహన ప్రియ అనుచరులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా బోండా ఉమా వేదిక పైనుండి సభకు హాజరైన వేలాది మందిని ఉద్దేశించి మాట్లాడుతూ :- కాపు జాతికి చరిత్ర ఉందని నాకు జాతిలో ఉన్నటువంటి ప్రముఖులు కాపు జాతి అభివృద్ధి కోసమే కాకుండా సమాజ హితువు కోసం, మిగిలిన జాతులను, కులాలను కలుపుకొని కలుపుకొని సంఘటితంగా, పనిచేసినటువంటి చరిత్ర చెబుతున్న అనేక అంశాలను వేదిక మీద నుండి జాతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
దినోత్సవం అంటే 50 సంవత్సరాల స్వర్ణోత్సవం అంటే పండుగ రోజు అని ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాల నుండి కూడా ప్రజా ప్రతినిధులుగా ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు జాతి ప్రతినిధులు అందరూ ఈ వేదికపై పాల్గొని మాట్లాడడం ఈ జాతి చరిత్ర చెబుతుంది అని, హర్షద్వానాల మధ్యన వ్యక్తం చేయడం జరిగింది.
కాపు జాతి ఆరాధ్య దైవం పూర్తి ప్రదాత వంగవీటి మోహనరంగారావు దగ్గర తాను అనేక సందర్భాలలో పనిచేస్తూ గమనించినటువంటి సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు, ఇదే నియోజకవర్గము నుండి ఆనాడు ఎమ్మెల్యేగా వంగవీటి మోహన రంగా గారు ప్రాతినిధ్యం వహిస్తే, తరువాత కాలంలో వారి కుమారులు, అనంతరం రంగా అనుచరులుగా రెండుసార్లు చరిత్ర సృష్టించే విధంగా మెజారిటీతో గెలుపొందడం ఏ రకంగా మేము మిగతా జాతులను కూడా కలుపుకొని, కులాలను కూడా కలుపుకొని పనిచేస్తున్నాము, చనిపోయిన ఈ మెజారిటీ నే నిదర్శనమని అన్నారు.
కృష్ణాజిల్లాకు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే స్వర్గీయ వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని నిరాహార దీక్షలు చేయడమే కాకుండా అనేక రూపాలలో ఆందోళనలు చేసి, ఆనాడు ఉన్న అరాచక ప్రభుత్వ ఉక్కు పాదాలతో అనిచివేసిన, అనిచిన కొద్దీ వంగవీటి మోహన రంగా స్ఫూర్తితో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఆ అరాచక ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి రాళ్లద్రోలి ఈ జాతికి ఉపయోగపడేటువంటి NDA ప్రభుత్వం ఈ జాతికి తీసుకురావడం జరిగిందని, కాపు కులస్తులు వారికి నచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీలో అయినా ఉండొచ్చు అని, ఆ రాజకీయ పార్టీల ద్వారా ఈ కులాలకు ఉపయోగపడేట్టు విధంగా వారు పనిచేయాలని తగు సూచనలు చేస్తూ తాను మాత్రం ఈ కుల అభివృద్ధి కోసం, ఈ కుల ఐక్యత కోసం, ఈ కుల భవిష్యత్తు కోసం అన్ని రకాల సహకారాన్ని అందించడమే కాకుండా నేను ముందుండి కనిపించడానికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని, ఇంత పెద్ద సభ కు వ్యయ ప్రయాసలు కూడి పనిచేసిన జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం ని అభినందిస్తూ, మిరియాల వెంకటరావు కి, వంగవీటి మోహన రంగా కి, మిగిలిన అమరులు అయిన కాపు కులస్తులు అందరికీ జోహార్లు అర్పిస్తూ కాపు, తూర్పు కాపు, మున్నూరు కాపు, తెలగ, బలిజ, వంటరి కులస్తుల ఐక్యతతో భవిష్యత్తులో అందరూ కలిపి ఒకే కాపు కుటుంబం గా ముందుకు సాగాలని సాగుద్ది అని ఆకాంక్షిస్తూ కాపు చరిత్రలోని అనేక ఘట్టాలను స్ఫూర్తిదాయకమైన విషయాలను, పెద్దల చరిత్రను, భవిష్యత్తు తరాల నడవడిక నడకను ఉద్దేశిస్తూ ఉద్రేక భరితమైనటువంటి ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమంలో కాపు నాయకులు, గాళ్ళ సుబ్రహ్మణ్యం, సామినేని ఉదయభాను, సోము వీర్రాజు, నవనీతం సాంబశివరావు, ఇప్పిలి మోహన్, పైడి శ్రీను, పిన్నింటి శ్రీనివాస్, బాసెట్టి ప్రసాద్, భూపతి మహేష్, ఇప్పిలి పండు, కోలా శ్రీనివాస్, పెద్ది శ్రీను, స్వామి, లతోపాటు పెద్ద ఎత్తున తదితరులు వేదికపై ఆసీనులు కాగా వేలాదిమంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News