Breaking News

అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను, స్వయంగా తానే తిని పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఐఏఎస్. బుధవారం ఉదయం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి అన్న క్యాంటీన్ లోని నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి ఆకస్మికంగా ఆహార నాణ్యతను పరిశీలించేందుకు అక్కడ ఆహారం తీసుకోవాలని, తద్వారా వారికి ఆహర నాణ్యత ఖచ్చితంగా తెలుస్తుందని, అక్కడికి వచ్చే ప్రజలను తరచుగా వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలని ప్రతి రోజు పర్యవేక్షిస్తూ అన్న క్యాంటీన్లో ఉండే వసతులలో ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ యుటి ఫర్హీన్ జాహిద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *