-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ లో టౌన్ వెండింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నగర పరిధిలో గల వీధి విక్రయదారులకు రెడ్, గ్రీన్, అంబర్, జోన్లనివేదికను సమీక్షించారు. వీధివిక్రయదారులు, పట్టణ ప్రణాళిక, ప్రజాప్రతినిధులు, జోనల్ కమిషనర్ల సమన్వయంతో సమర్పించిన జోన్ల నివేదికను పోలీస్ వారు ట్రాఫిక్ కోణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని, ఇప్పుడు కేటాయించిన రెడ్, గ్రీన్ అంబర్ జోన్లలో ఏమన్నా మార్పులు ఉన్నచో తెలుపాలని, టౌన్ వెండింగ్ కమిటీ లో ఉన్న సభ్యులందరి సమన్వయంతో, సంతృప్తికరమైన జోన్ల నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
వీధివిక్రయదారులు కచ్చితంగా గుర్తింపు కార్డును కలిగి ఉండాలని, వీధి వ్యాపారం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ విజయవాడ నగరపాలక సంస్థ వారి అకౌంట్ కు 200 రూపాయలు చెల్లించి గుర్తింపు కార్డును తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిసిపి ట్రాఫిక్ షేక్ షిరిన్ బేగం, ఏసిపి ట్రాఫిక్ రామచంద్ర, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ వై.ఎస్. రమేష్, విఎంసి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, టౌన్ వెండింగ్ కమిటీ కన్వీనర్ మరియు ప్రాజెక్టు ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కే. ప్రియాంక, బ్రాంచ్ మేనేజర్ M. సుధాకర్, కమిటి సభ్యలు అయిన వీధి వ్యాపారస్తులు L.V. ముర్తిరావు చిప్పడ, నాగ వెంకట బాలకృష్ణ, షేక్ సబీర్, బొమ్మిసేట్టి జగన్మోహన్ రావు, కంకిపాటి రత్నకుమారి, పిల్లి నాగమల్లేశ్వరి, కద్గరాజు మీనషి, తదితర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News