Breaking News

అకాడమీ నిర్వహణ పై పలు అంశాలపై చర్చ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్  ఆలపాటి సురేశ్ కుమార్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన యీ సమావేశంలో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల వివరాలను ఛైర్మన్ వివరించారు. అకాడమీ నిర్వహణ పై పలు అంశాలపై చర్చించారు.
డైరక్టర్ విశ్వనాథన్ కు సి.ఆర్.మీడియా కార్యాలయం వద్ద సెక్రటరీ వి. మణిరాం, మేనేజర్ ఎం. భాస్కర నారాయణ స్వాగతం పలికారు. సమావేశం అనంతరం కార్యాలయ సిబ్బంది ని డైరక్టర్ కు సెక్రటరీ మణిరాం పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి ఎస్. శ్రీనివాస జీవన్, అకాడమీ అకౌంట్స్ అధికారి జి. శాంతారాం, లైబ్రేరియన్ వి.శేఖర్, ఇతర సిబ్బంది జాలి రెడ్డి, ఆదిత్య లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *