-విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పై చర్చ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కర స్నానం, అమ్మవారి దర్శనం జరిగేలా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై ఎంపీ కేశినేని శివనాథ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో చర్చించారు.
సోమవారం తాడేపల్లిలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో ఆయనతో ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధావెంకన్న కూడా పాల్గొన్నారు. పుష్కర సమయంలో అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు కల్పించాల్సిన మౌళిక సదుపాయాలు, వెయిటింగ్ హాల్స్ నిర్మాణం, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు అంశాలపై చర్చించారు.
ఇటీవల ఆలయ అధికారులు, చైర్మన్ తో కలిసి ఆలయంలో చేసిన క్షేత్ర స్థాయి పరిశీలన పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు. ఆలయనికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు ఆలయ అభివృద్దికి కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు.
Prajavartha Online Telugu News