Breaking News

కొత్త మీడియా అక్రిడిటేషన్ ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కొత్తగా మీడియా అక్రిడిటేషన్ ల మంజూరు కోసం అర్హులైన జర్నలిస్టులు వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఉప సంచాలకులు యమ్.వెంకటేశ్వర ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రెండేళ్ల కాల పరిమితితో కొత్త అక్రిడిటేషన్ లు జారీ చేయుటకు ఈ నెల డిసెంబరు 15 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయనున్నామని, ఈ నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు తమ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల జాబితాను వెంటనే అందజేసి సహకరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులు తమ పేరును https://mediarelations.ap.gov.in అనే వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తులు సమర్పించాలని, దరఖాస్తు ముద్రించిన ప్రతిని సంబంధిత అనుబంధ పత్రాలను జతచేసి మచిలీపట్నం కలెక్టరేట్ లోని వారి కార్యాలయంలో సమర్పించాలని డిఐపిఆర్ఓ కోరారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *