Breaking News

నగర పరిశుభ్రతకు పారిశుధ్య కార్మికులు వెన్నుముక లాంటి వారు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిశుభ్రతకు పారిశుధ్య కార్మికులు వెన్నుముక లాంటి వారని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు ప్రధాన కారణమైన పారిశుద్ధ్య కార్మికులను స్వచ్ఛ సర్వేక్షన్ 2024 లో, సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్ వచ్చిన శుభ సందర్భంలో అందుకు ముఖ్య కారకులైన పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను బహుకరించారని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో గల పారిశుద్ధ్య కార్మికులందరికీ వస్త్రాలను అందేటట్టు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *