తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి మరియు సాయినగర్ షిరిడిలను కలుపుతూ భారతీయ రైల్వే శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ రైలును నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న, తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్ మేడా రఘునాథ్ రెడ్డి, న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరై, వర్చువల్‌గా జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మాట్లాడుతూ, ఈ రైలు ఏర్పాటు కోసం పలుమార్లు కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ రైలు సేవలు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని, రెండు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని తెలిపారు.
Prajavartha Online Telugu News