Breaking News

ప్రభుత్వ సంస్థల్లో ఆహార లోపాలను గుర్తించి సరి చేసేందుకే జిల్లాల వారి పర్యటన…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంస్థల్లో ఆహార లోపాలను గుర్తించి సరి చేసేందుకే జిల్లాల వారి పర్యటన చేస్తున్నామని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జె కృష్ణ కిరణ్ వెల్లడించారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఆహార కమిషన్ సభ్యులు రెండో రోజున బుధవారం అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు.

తొలుత వారు మోపిదేవి మండలంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ చౌక దుకాణాలను పరిశీలించి స్టాక్ వివరాలు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చౌక దుకాణం డీలర్లు అందరూ లిఖితపూర్వకంగా ఆహార కమిషన్కు ఫిర్యాదు చేస్తూ ఎం ఎల్ ఎస్. పాయింట్ నుండి తూకం వేయకుండా నేరుగా సరుకులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయగా కమిషన్ సభ్యులు వెంటనే స్పందిస్తూ జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.

మోపిదేవి ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు.
మోపిదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన సమస్యలపై ఉపాధ్యాయులకు, ఎంఈఓ కు పలు సూచనలు చేశారు.

తదుపరి అవనిగడ్డ లో అంగన్వాడి కేంద్రాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ చేసి అందుతున్న ఆహారపు వస్తువులు మధ్యాహ్న భోజనం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పులిగడ్డలో గురుకుల పాఠశాల సందర్శించి అక్కడ విద్యార్థులకు అందుతున్న ఆహారం, మధ్యాహ్న భోజన పథకం తదితర విషయాలపై విద్యార్థులతో పాటు అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
గురుకుల పాఠశాల విద్యార్థులు దాదాపు 90 శాతం మంది తమకు సరైన ఆహారం పెట్టడం లేదని, మజ్జిగ నీళ్లుగా ఉంటుందని,పులిహార బాగా ఉండటం లేదని, అన్నం వడగటం లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన చర్యలు ఉంటాయని కమిషన్ సభ్యులు స్పష్టంగా చెప్పారు.

తదుపరి నాగాయలంకలోని ఎంఎల్ఎస్ పాయింట్ తనిఖీ చేసి అక్కడ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తదనంతరం కమిషన్ సభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో ఆహార కమిషన్ పర్యటనలో భాగంగా జిల్లాల్లో రెండు రోజుల పర్యటనకు వచ్చామని మొదటి రోజు మచిలీపట్నం, పెడన నియోజక వర్గాలలో, రెండవ రోజు అవనిగడ్డ నియోజకవర్గం లో పర్యటించామన్నారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ చౌక దుకాణాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనము ఆహార వస్తువులను పరిశీలించామన్నారు.

కొంతమంది అంగన్వాడి టీచర్లు జారీ చేశామన్నారు సరిగా విధులు నిర్వహించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
కృత్తివెన్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు.
విద్యార్థుల చెప్పిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
రెండవ రోజు అవనిగడ్డలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించామని అక్కడ బాలామృతం, పాలు, గుడ్డు ఏమి లేకపోవడం గుర్తించడం జరిగిందన్నారు.
ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అంగన్వాడి కేంద్రాల్లో పాలు గుడ్డు కనీసం స్టాకు గత 4 రోజులుగా లేవంటున్నారని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి వారి వివరణ కోరుతున్నామన్నారు.

అలాగే 4 మండలాలకు కలిపి నాగాయలంకలో ఎంఎల్ఎస్. పాయింటు ఉందని అక్కడి నుండి తెచ్చుకోవలసిన పరిస్థితి ఉందన్నారు.
ఎక్కువగా కొలతలతో సరుకులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారన్నారు. దాని వలన తూకాలలో వ్యత్యాసంతో పాటు వస్తున్నాయని ఈ విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
సంబంధిత స్టాకులేని అంగన్వాడి కేంద్రాలకు వెంటనే సరుకులు పంపించాలని అధికారులకు సూచిస్తున్నామన్నారు. కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులకు చెప్పామన్నారు

మోపిదేవి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలు గుడ్డు వెళ్లలేదని గుర్తించామన్నారు మోపిదేవిలోని ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలకు షో కాస్ నోటీసులు జారీ చేశామన్నారు.

కమిషన్ సభ్యులు వెంట ఐసిడిఎస్ సిడిపిఓ ప్రసన్న విశ్వనాథ, తూనికలు కొలతల తనిఖీ అధికారి ఈశ్వరరావు, ఉపవిద్యాధికారి శేఖర్ సింగ్, సి ఎస్ డీటీలు కొడాలి శ్రీనివాసరావు, కాశీం బాబు, ఎంఈవోలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *