Breaking News

పేద నిరుపేద ప్రజల, అర్హులైన లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి…

కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, పేద నిరుపేద ప్రజల, అర్హులైన లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నదని తెలిపారు. ఆ నమ్మకమే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిబంభించిందన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగం లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుని వొచ్చి అమలు చేస్తున్నామన్నారు. కొవ్వూరు కి చెందిన లబ్దిదారునికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజురైన రూ.7,50,000 ల చెక్కును మంత్రి తానేటి వనిత అందచేశారు. కొవ్వూరు నుంచి తాళ్లపూడి కి బదిలీపై వెళ్లి ఎస్ ఐ వెంకట రమణ , కొవ్వూరు రూరల్ ఎస్ ఐ సతీష్ లు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *