Breaking News

రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్‌ కేఎస్ జవహర్ ను కలిసిన మంద కృష్ణ మాదిగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్.ఆర్.పి.ఎస్. నాయకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మంగళవారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణం, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ బ్లాక్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కె.ఎస్. జవహర్, సెక్రటరీ ఎస్. చిన్న రాముడును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సమావేశంలో మంద కృష్ణ మాదిగ ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం బేడ, బుడగ జంగం కులాలను దళితుల జాబితా నుండి విడదీయడం వల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరించారు. గతంలో ప్రత్యేక కమిషన్లు వేసినప్పటికీ ఈ సమస్యకు సరైన పరిష్కారం లభించలేదని, కమిషన్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన కమిషన్, ఈ విషయంలో మంద కృష్ణ మాదిగ కూడా తమ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేసింది.

తాడికొండ నియోజకవర్గం, గరికపాడు గ్రామానికి చెందిన దళితుల భూముల ఆక్రమణ గురించి ప్రస్తావించారు. షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు కేటాయించిన 1.30 సెంట్ల భూమి, అగ్నిప్రమాదాలు, వరదల సమయంలో ఖాళీ చేసిన తరుణంలో ఆక్రమణకు గురైందని తెలిపారు. ఈ విషయంలో కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని, బాధిత లబ్ధిదారులకు తిరిగి భూమిని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

​ఈ కార్యక్రమంలో కమిషన్ ఉన్నతాధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *