Breaking News

ICDS సేవలను మరింత బలోపేతం చేస్తూ డిజిటల్ పాలన దిశగా కీలక అడుగు

-ICDS సిబ్బందికి 5G మొబైల్ ఫోన్లు, మెడికల్ కిట్స్ పంపిణీ – మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పిల్లలు, గర్భిణీ మహిళలు, బాలింతలు, వితంతువులు సమగ్ర సంరక్షణ పొందేలా సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS)ను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ICDS సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో ICDS సిబ్బందికి అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లు అందజేయడం జరిగిందని మంత్రి గారు పేర్కొన్నారు. ICDS అనేది కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాల ఆరోగ్యం, పోషణ, విద్యకు పునాది అని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా 0–6 సంవత్సరాల పిల్లలకు పోషణ, ఆరోగ్య సంరక్షణ, ప్రీ–స్కూల్ విద్య ,గర్భిణీ మహిళలు, బాలింతలకు పోషకాహారం, వైద్య పర్యవేక్షణ వితంతువులు, ఆర్థికంగా బలహీన మహిళలకు సామాజిక భద్రత అందుతున్నదని తెలిపారు. 5G మొబైల్ ఫోన్లు – సేవల వేగం, పారదర్శకత కోసం ICDS సిబ్బందికి 5G మొబైల్ ఫోన్లు అందజేయడం సేవలను డిజిటల్, పారదర్శకంగా మార్చే దిశలో కీలక నిర్ణయం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న 211 మంది అంగన్‌వాడీ టీచర్లకు, 8 మంది సూపర్వైజర్లకు 5G మొబైల్ ఫోన్లు నిడదవోలు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది అని మంత్రి  తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్ విజన్లో భాగంగా ఫీల్డ్ స్థాయి నుంచి నేరుగా ప్రభుత్వానికి రియల్ టైమ్ డేటా ప్రీ–స్కూల్ పిల్లల హాజరు, అభివృద్ధి వివరాల డిజిటల్ నమోదు కుటుంబాల (Family Statistics) సమగ్ర డేటా సేకరణ ICDS సిబ్బందికి మధ్య వేగవంతమైన కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని తెలిపారు.
మెడికల్ కిట్స్ పంపిణీ – ప్రాథమిక ఆరోగ్య భద్రత సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్స్ పంపిణీ చేయడం ద్వారా పిల్లలు, గర్భిణీ మహిళల ఆరోగ్యాన్ని ప్రారంభ దశలోనే పర్యవేక్షించవచ్చని మంత్రి  తెలిపారు. దీనివల్ల పోషక లోపాలు, రక్తహీనత వంటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.డిజిటల్ యాప్స్ ద్వారా ఆరోగ్య పర్యవేక్షణ ప్రభుత్వం అమలు చేస్తున్న బాల సంజీవని మొబైల్ యాప్ పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్
ద్వారా పిల్లలు, గర్భిణీ మహిళల ఆరోగ్యం, పోషణ స్థితిని నిరంతరం డిజిటల్‌గా ట్రాక్ చేస్తున్నామని తెలిపారు. ఈ డేటా భవిష్యత్ విధాన నిర్ణయాలకు కీలకంగా మారుతుందని మంత్రి  పేర్కొన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (PMMVY) కింద మొదటి ప్రసవానికి 5,000/- ,రెండవ ప్రసవానికి బాలిక పుడితే 6,000/- ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా తల్లుల పోషణ మెరుగుపడటంతో పాటు, బాలికల జననానికి ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు. డిజిటల్ సాంకేతికతను మానవీయ దృక్పథంతో మిళితం చేసి ICDS సేవలను మరింత ప్రభావవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కందుల దుర్గేష్ గారు స్పష్టం చేశారు. ఈ చర్యలు రాష్ట్రాన్ని బాలలు, మహిళల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా కీలక అడుగు అని అన్నారు ,ఈ కార్యక్రమంలో CDPO ఆశా రోహిణి, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *