– తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, ఈస్ట్ చోడవరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ ముందు మేకను బహిరంగంగా వధించిన నిందితులను 24 గంటలలోపే అరెస్టు చేసి, నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన జిల్లా పోలీసులు.
ది. 26.12.2025వ తేదీన రాత్రి సుమారు 08-40 గంటలకు, నల్లజర్ల మండలం, ఈస్ట్ చోడవరం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అయిన 1) కొండ బత్తుల సాధు, తండ్రి ఆనందరావు, 2) పొట్టి నవీన్, తండ్రి ప్రసాద్, 3) కనికెళ్ల రవి, తండ్రి సహదేవుడు, 4) అక్కల యేసు, తండ్రి వెంకటేష్, 5) దొడ్డిగర్ల రాజేష్, తండ్రి బాలసుందరం, 6) కత్తుల రమేష్, తండ్రి గంగరాజు, 7) ఉసురుమర్తి పెద్ద సాయి కుమార్, తండ్రి సుబ్బారావు, ఈస్ట్ చోడవరం గ్రామంలో ద్వేషపూరిత మరియు రెచ్చగొట్టే భాషతో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, ఆ ఫ్లెక్సీ ముందు బహిరంగంగా ప్రజలందరూ చూస్తుండగా ఒక మేకను వధించారు. వెంటనే, నల్లజర్ల పోలీస్ స్టేషన్ సీఐ గారు తన సిబ్బందితో, కొవ్వూరు సబ్-డివిజన్ బలగాలతో మరియు ప్రత్యేక బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
నల్లజర్ల మండలం, ఈస్ట్ చోడవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి కొడూరి శ్రీనివాసరావు ఇచ్చిన నివేదిక ఆధారంగా, Cr. no. 246/2025 196, 351(2) బీఎన్ఎస్, జంతువుల పట్ల క్రూరత్వాన్ని నివారించే చట్టం, 1960లోని సెక్షన్ 11(i) మరియు ఆయుధాల చట్టం, 1959లోని సెక్షన్ 27(1) కింద కేసు నమోదు చేయబడింది.
నిందితులందరినీ అరెస్టు చేసి పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి నాటుసారా కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిందితులందరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపే నేపథ్యంలో, నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం జరిగింది.
నల్లజర్ల మండలం, ఈస్ట్ చోడవరం గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది.
Prajavartha Online Telugu News