Breaking News

నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలు

-12వ వి.సి.ఎస్ & టి.ఎ బాలోత్సవంలో యువ ప్రతిభకు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రోత్సాహం

ఎనికేపాడు, విజయవాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ & ట్యుటోరియల్స్ అసోసియేషన్ (VCS & TA) ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ VCS & TA బాలోత్సవం ఘనంగా జరిగింది. బాలలలోని దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికి తీసే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలని, వారి సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో కీలకమని అన్నారు. బాలలలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మక ఆలోచన, పోటీ భావనను పెంపొందించడంలో ఇటువంటి బాలోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులను సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమం విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఎనికేపాడు, విజయవాడలో నిర్వహించబడింది. వివిధ పాఠశాలలు మరియు ట్యుటోరియల్స్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల ఉత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చాయి. ఈ బాలోత్సవంలో వి.సి.ఎస్ & టి. ఎ అసోసియేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *