Breaking News

పదవ తరగతి… ఉన్నత చదువులకు కీలకం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్తులో ఉన్నత చదువులకు పదవ తరగతి కీలకమని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా విద్యార్థులకు సూచించారు. మంగళవారం స్థానిక ఏ.టి అగ్రహారంలోని ఎస్.కే.బి.ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థుల తరగతుల గదులకు కలెక్టర్ వెళ్లి విద్యా బోదనను, రానున్న పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధత వివరాలను తెలుసుకున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, సీఎలు, ఆర్మీ అధికారులుగా ఎంత మంది అవ్వాలనుకుంటున్నారని విద్యార్థులను ప్రశ్నించి వారి స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతిలో సాధించిన మార్కులు భవిష్యత్తులో ఉన్నత చదువులకు, ఉపాధి అవకాశాలకు కీలకమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా చదువుకొని రానున్న పదవతరగతి పరీక్షలలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించాలని, నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రభుత్వం రానున్న పదవ తరగతి పరీక్షలకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం చదువుకోవాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని సమస్యలు ఏమైనా ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అసెస్మెంట్ పరీక్షలు బుక్లెట్లో కాకుండా మాక్ టెస్ట్ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించాలని, లెక్కలు, బయాలజీ సైన్సు, హిందీ తరగతులు అదనంగా నిర్వహించాలని, సాయంత్రం స్టడీ అవర్స్ లో అల్పాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. వీటిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ విద్యార్థులు తెలిపిన విధంగా మాక్ టెస్ట్ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టులకు అదనంగా తరగతులు నిర్వహించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా మాట్లాడి వారికి అవసరమైన సబ్జెక్టులలో అదనపు తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్లో అల్పాహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా. సలీం భాష, ఎంఈఓ ఖుద్దూస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాజావలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *