అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో మన విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరిగినది. ఎక్కడా లేనివిధంగా మన విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ సీతారామచంద్రలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, గోదా రంగనాదులు అందరు కలిసి ఉత్తర ద్వారంగా ఈరోజు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఆ శ్రీనివాసుని దర్శించుకుంటారో వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం, ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు విచ్చేసి పెరుమాళ్ళ అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. త్వరలో విజయకిలాద్రిపై virtual Reality live Experience తో ఒక కొత్త ప్రపంచాన్ని విజువల్ వండర్స్ తో ఆ భగవంతుడు నివాసం ఉండే లోకాలను భక్తులకు దగ్గరగా చూపించే విధంగా ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు… త్వరలో అందరికీ ఇది అందుబాటులో వస్తుందని , వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదనాచార్యులు, శ్రీనివాసచార్య స్వామి, ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు తెలిపారు.
Prajavartha Online Telugu News