Breaking News

అహింసే ఆయుధంగా జీవితకాలం పోరాడిన మహనీయుడు మహాత్మా గాంధి…

-ఆ మహాత్ముని జయంతి రోజున స్మరించుకోవడం మన కర్యవ్యం…
-ఎంపీపీ గద్దే పుష్పరాణి

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అహింసే ఆయుధంగా జీవితకాలం పోరాడి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మహనీయులు మహాత్మాగాంధి అని వారి ఆశయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాద్యత మనఅందరిపైనా ఉందని ఎంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధి, లాల్ బహుదార్ శాస్త్రి జయంతి వేడుకలను పురష్కరించుకొని శనివారం వారి చిత్రపటాలకు పూలదండలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మనిషిగా పుట్టి నీతి, నిజాయితీకీ కట్టుబడి సాధారణ జీవితాన్ని గడిపిన మహనీయలు మహాత్మాగాంధి, లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. మహనీయులైన వారి ఆదర్శాలను భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
యంపీడీవో ఏ. వెంకటరమణ మాట్లాడుతూ శాంతి, అహింస, సత్యం ద్వారానే ఎటువంటి పనినైనా సాధించవచ్చుననే విదానంతో బానిస సంకేళ్ల నుంచి విముక్తి చేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయు పూజ్య భాపూజీ అన్నారు. మహాత్మా గాంధి జీవితం ప్రపంచానికే ఆర్శమన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆ మహాత్ముడి జయంతి రోజున ఇచ్చిన ఘనమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామకృష్ణ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *