-ప్రజలకు ఎంపి కేశినేని శివనాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎంపి కేశినేని శివనాథ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలంటే, ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు అందరికీ మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు. యువతీ, యువకులు, మహిళలు, నిరుద్యోగులు జాతీయ గ్రామీణ స్వయం ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని స్వయం ఉపాధి రంగంలో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
నూతన ఆలోచనలకు, ఆత్మవిశ్వాసానికి ఈ కొత్త సంవత్సరం ఒక పునాది కావాలన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కృషి చేయటంతో పాటు , ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు.
2026 సంవత్సరం ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా సమృద్ధిగా సంపద, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News