అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తూకాలు, కొలతలు, ప్యాకేజ్డ్ ఉత్పత్తులు మొదలైన వాటికి సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ (PGRS) టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 కు కాల్ చేసి వెంటనే నమోదు చేసుకోవచ్చని, అలా అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని లీగల్ మెట్రాలజీ శాఖ జాయింట్ కంట్రోలర్ కృష్ణచైతన్య అంగోతు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నున్న జాయింట్ కంట్రోలర్లు, డిప్యుటీ కంట్రోలర్లు అందరూ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని, ప్రజలు తమ ఫిర్యాదులను సులభంగా నమోదు చేయడానికి పెట్రోల్ బంకులు, రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లు మొదలైన బహిరంగ ప్రాంగణాల్లో హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
Tags amaravathi
Check Also
ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు
-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …
Prajavartha Online Telugu News