-ఈ నెల 13న రాజమహేంద్రవరంలోనీ ఎస్.కె.వి.టి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో
– జిల్లా క్రీడా అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా స్థాయిలో సాంప్రదాయ క్రీడల పోటీలను స్థానిక ఎస్ కె వి డిగ్రీ కళాశాల లోన్నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డి.ఎం.ఎం. శేషగిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందిం చడంతో పాటు శారీరక దృఢత్వాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, తూర్పు గోదావరి జిల్లా ఉత్తర్వుల మేరకు ఈ పోటీలు నిర్వహించ నున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలను ఈ నెల 13వ తేదీ ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం నగరంలోని ఎస్.కె.వి.టి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో మహిళలకు స్కిప్పింగ్ రోప్ (తాడాట), తొక్కుడు బిళ్ల పోటీలు, పురుషులు మరియు మహిళలకు కర్రసాము, టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుడు) పోటీలు, పురుషులకు ఏడు పెంకులాట, గాలిపటాల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News