-లాటరీ పద్ధతిలో పారదర్శకంగా 2,111 మందికి పట్టాల పంపిణీ
-రూ.16 కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ ఫీజు మినహాయింపు
-ల్యాండ్ పూలింగ్ విధానం లో భూముల పంపిణీ
-శరవేగంగా అభివృద్ధి చెందనున్న శెట్టిపల్లి ప్రాంతం
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు
-రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యను తెలుసుకున్న జిల్లా కలెక్టర్
-తిరుపతి ఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు
-ఉదార స్వభావంతో ఆలోచించి శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి
-తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశంతో చాలా కాలం నుండి పరిష్కారం కాని శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించి ఆన్లైన్ లాటరీ పద్ధతిలో భూములు కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో శెట్టిపల్లి భూ కేటాయింపు పై తిరుపతి ఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, తుడా విసి, ఇంచార్జ్ జే సి గోవిందరావు లతో కలసి లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్, తిరుపతి ఎం ఎల్ ఏ, తుడా చైర్మన్ ల పై లబ్ధిదారులు పూల వర్షం కురిపించి తమ హర్షాతిరేకలు వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శెట్టిపల్లి భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2019 న జి.ఓ తీసుకువచ్చింది, కోర్టు కేసులు, ఇతర రెవెన్యూ సమస్యల కారణంగా భూముల సమస్య పరిష్కారం కాలేదన్నారు. శెట్టిపల్లి భూముల వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రుల బృందం ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు సమస్య పై వాకబు చేశారన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. 636 ఎకరాల శెట్టిపల్లి భూముల సమస్యను ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా పరిష్కరించి ఆన్లైన్ లాటరీ పద్ధతిలో పారదర్శకంగా 2,111 మందికి భూముల పట్టాలను కేటాయించే విధానాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. త్వరలో తుడా నుండి భూమి రిజిస్ట్రేషన్ చేసి ల్యాండ్ పూలింగ్ ఓనర్ డాక్యుమెంట్ లను క్యూ ఆర్ కోడ్ లతో పక్కాగా భూ హక్కు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఒక ఊరు మొత్తం భూమి సమస్యను పరిష్కరించి భూములు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో 30% భూమిని వ్యవసాయం కొరకు, 50 శాతం భూమిని ఇంటి పట్టాల కొరకు కేటాయించామన్నారు. గృహ నిర్మాణానికి ప్రతి లబ్ధిదారునికి 2 సెంట్ ల భూమి పంపిణీ చేస్తామని, లే ఔట్ వివరాలను డిస్ప్లే చేస్తామన్నారు. భూముల రిజిస్ట్రేషన్ కొరకు మొత్తం రూ.16 కోట్లు రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ డ్యూటీ ఫీజు రాష్ట్ర ప్రభుత్వం మినహాయించిందన్నారు. భవిష్యత్తులో శెట్టిపల్లి చుట్టుప్రక్కల వాణిజ్య సముదాయాలు, హోటల్ లు, కన్వెన్షన్ హాల్ లు రానున్నాయని, తద్వారా శెట్టిపల్లి భూముల విలువ గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. 225 ఎకరాలలో మోడల్ టౌన్ షిప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.1.50 కోట్లు చొప్పున సుమారు రూ.350 ఖర్చు చేయనున్నదన్నారు. ఈ నిధుల ద్వారా సీసీ రోడ్ లు, డ్రైనేజ్ నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు, త్రాగునీటి వసతి, మంగళం నుండి శెట్టిపల్లి మోడల్ టౌన్ షిప్ కు 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాల కాలం గడుస్తున్నా పరిష్కారం కాని శెట్టిపల్లి భూముల సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల చొరవతో, జిల్లా కలెక్టర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ల ఆధ్వర్యంలో పరిష్కరించడం జరిగిందన్నారు. 2024 లో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భాగంగా శెట్టిపల్లి భూ సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ పలుమార్లు శెట్టిపల్లి లో సందర్శించి బాధితులతో మాట్లాడారన్నారు.
తుడా చైర్మన్ మాట్లాడుతూ ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు శెట్టిపల్లి భూముల.పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. గతంలో గృహనిర్మాణానికి ప్రభుత్వం 1.5 సెంట్లు నిర్ణయించగా, అడిగిన వెంటనే 2 సెంట్లు కేటాయించడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు.కూడా ముఖ్యమంత్రి మినహాయించారన్నారు.
ఈ కార్యక్రమంలో, డి ఆర్ ఓ జి.నరసింహులు, ఆర్ డి ఓ రామ్మోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ దేవి కుమారి, భూ సేకరణ అధికారి సుజన తిరుపతి తహశీల్దార్ సురేష్ బాబు, శెట్టిపల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News