Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో చట్టరీత్యా చర్యలు

విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-3 కార్యాలయం పటమట నందు సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 19 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 7,150/- రూపాయలు జరిమానా విధించారు. మరోసారి మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా రోడ్లపై మాట్లాడుతూ చెత్త వేసిన మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్ట్ చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలని మొబైల్ కోర్ట్ జడ్జి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ హెచ్ 3 డాక్టర్ గోపాల్ నాయక్, శానిటరీ సూపర్వైజర్స్ రమేష్ బాబు, బాలాజీ శ్రీనివాస మూర్తి , శానిటరీ ఇన్స్పెక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *